సినిమా వార్తలు

‘వినయ విధేయ రామ’పై వర్మ సంచలన కామెంట్స్


9 months ago ‘వినయ విధేయ రామ’పై వర్మ సంచలన కామెంట్స్

దర్శకుడు బోయపాటి-హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లో  జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ‘గోల్డ్, డైమండ్ మిక్స్ చేస్తే.. వినయ విధేయ రామ ట్రైలర్’ అంటూ అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. ‘బోయపాటి ట్రైలర్ వావ్ అనిపించేలా ఉంది. దీనిని హిందీలో కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే గోల్డ్(కేజీఎఫ్), డైమండ్స్ మిక్స్ చేస్తే ఈ ట్రైలర్. జంజీర్ తరువాత హిందీలో విడుదల కాబోయే రెండో చిత్రమిది కాబట్టి రామ్ చరణ్‌కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అతను సింపుల్‌గా మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాడు’ అని వర్మ కామెంట్ చేశారు.