సినిమా వార్తలు

చంపేశావ్ రానా... చంపేశావ్: వర్మ


7 months ago చంపేశావ్ రానా... చంపేశావ్: వర్మ

క్రిష్ దర్శకత్వంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించిన విడుదలైన విషయం విదితమే. మొదటి భాగం కథానాయకుడుగా, రెండో భాగం మహానాయకుడుగా విడుదలయ్యాయి. మహానాయకుడు చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ నటుడు రానా ఒదిగిపోయాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో రానా పాత్రపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ చిత్రంలో రానా ఫోటోను ఉద్దేశిస్తూ.. చంపేశావ్ రానా .. నిజానికి మించి నీ రూపు కనిపిస్తుంది అంటూ ఎన్టీఆర్ మహానాయకుడులోని ఓ ఫోటోను ఫోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇదిలావుండగా ఆర్జీవి దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అదీకాక ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడుని విలన్‌గా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మహానాయకుడలో నాదెండ్ల భాస్కరరావును విలన్‌గా చూపించారు.