సినిమా వార్తలు

నాదెండ్ల ఇంటర్వ్యూలతో కథనాయకుడు కలెక్షన్లు: వర్మ


8 months ago నాదెండ్ల ఇంటర్వ్యూలతో కథనాయకుడు కలెక్షన్లు: వర్మ

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వెన్నుపోటు, ఎందుకు పేరుతో రెండు పాటలను వర్మ విడుదల చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగేలా చేసింది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘ఎన్టీఆర్-కథా నాయకుడు’ సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా కంటే ఎన్టీఆర్, చంద్రబాబుపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఇచ్చిన ఇంటర్వ్యూకు ఎక్కువ హిట్లు వస్తున్నాయని అన్నారు. తాజాగా వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఓవైపు ఎన్టీఆర్ సినిమాలను ఫేమస్ చేసే ప్రయత్నంలో మేమంతా ఉంటే, నాదెండ్ల భాస్కరరావు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న హిట్లు, కథానాయకుడు సినిమా కలెక్షన్లను మించిపోతున్నాయి. దేవుడు, ప్రజలు.. ఎవరూ జరగబోయేదాన్ని అంచనా వేయలేరు అనడానికి ఇదే సాక్ష్యం’ అని వర్మ ట్వీట్ చేశారు.