సినిమా వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!


7 months ago ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రానికి నిర్మాత రాకేశ్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిందే.  అయితే ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తుండగా దిగిన ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న రాకేశ్ రెడ్డి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మరో ట్వీట్ లో.. నవ్వులు చిందిస్తూ ఎడమ వైపున కూర్చుని ఉన్న వ్యక్తి రాకేశ్ రెడ్డి అని, మధ్యలో కూర్చుని ఉన్న వ్యక్తి అతని స్నేహితుడు అని వర్మ తెలియజేశారు. అయితే కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, మధ్యలో కూర్చున్న వ్యక్తి వైసీపీ నేత మిథున్ రెడ్డి కాగా, కుడి వైపున కూర్చుని ఉన్నది వైసీపీ అధినేత జగన్. కాగా, విమానంలో ఈ ముగ్గురు కలిసి ఏ సందర్భంలో ప్రయాణించారన్న విషయాన్ని వర్మ వెల్లడించలేదు.