సినిమా వార్తలు

ప్ర‌భాస్ పై రెవెన్యూ అధికారుల ఆరోప‌ణ‌లు


5 months ago ప్ర‌భాస్ పై రెవెన్యూ అధికారుల ఆరోప‌ణ‌లు

హీరో ప్రభాస్ భూ ఆక్రమణ‌దారుడేన‌ని  తెలంగాణ రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభాస్, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, అందులో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నార‌ని, అందువల్లే తాము దాన్ని సీజ్ చేశామని తెలంగాణ రెవెన్యూ అధికారులు, సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో, సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌ కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతూ… అందుకు గల కారణాలను తమ పిటిషన్ లో వెల్లడించారు. అయితే, ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కేసు విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది. అయితే తాను ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొన్నానని, రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రభాస్, హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలంలోని తన భవంతికి ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నానని, ఎటువంటి వివాదాలు లేకపోయినా, తాను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నానని, రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని సినీ నటుడు ప్రభాస్ కోరారు