సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ కు అక్కగా రేణు దేశాయ్


7 months ago బెల్లంకొండ శ్రీనివాస్ కు అక్కగా రేణు దేశాయ్

తెలుగు తెరపై కథానాయికగా మెరిసిన రేణు దేశాయ్, పవన్ తో వివాహం తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాతికాలంలో ఆమె దర్శక నిర్మాతగా మారి, తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీభాషలో చేస్తూ వస్తున్నారు. తాజాగా రేణుదేశాయ్ తెలుగులో ఒక సినిమాలో కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా దర్శకుడు వంశీకృష్ణ ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. ఇది 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో రేణు దేశాయ్ నటించనున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే రేణు దర్శక నిర్మాతగా సక్సెస్ కాకపోవడం తోనే తిరిగి ఆమె నటన వైపు దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తల్లి పాత్రలతో నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితర సీనియర్ హీరోయిన్స్ బిజీ అయ్యారు. ఇక స్నేహా .. భూమిక వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. రేణు దేశాయ్ కూడా బిజీ అవుతారేమో వేచి చూడాలి.