సినిమా వార్తలు

‘సైరా’కోసం రాయలసీమ సెట్


9 months ago ‘సైరా’కోసం రాయలసీమ సెట్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్నవిషయం విదితమే. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమ వాతావరణం ప్రతిబింబించేతా ఒక విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. 'నరసింహ రెడ్డి గూడెం' పేరుతో ఈ సెట్ సినిమాలో కనిపించనుందని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పర్యవేక్షణలో సెట్ రూపకల్పన జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ విలేజ్ సెట్ లో ఒక గ్రూప్ సాంగ్ తో పాటు, ప్రధాన పాత్రధారులంతా పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విలేజ్ సెట్ నిర్మాణం పూర్తవగానే ఇక్కడ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.