సినిమా వార్తలు

త్వరలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం


11 months ago త్వరలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం

మూస కథలతో ప్రేక్షకులను, అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్న మాస్ మహారాజ రవితేజ..ఇక నుండి ఆ కథలను పక్కకు పెట్టి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సరికొత్త కథలతో వచ్చేందుకు సిద్ధమైయ్యాడని సమాచారం. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ అనే విభిన్న కథని చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక , నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీని తరవాత రవితేజ దర్శకుడు విఐ ఆనంద్ తో ఓ సినిమా చేయనున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ తో తన టాలెంట్ ఏంటో రుజువు చేసిన ఆనంద్..ఇప్పుడు రవితేజ తో కూడా ఓ సరికొత్త కథను తీయబోతున్నారట. రవితేజ కెరియర్ లోనే ఇలాంటి కథ చేయలేదని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ లో మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన జోడి ఎవరనేది త్వరలోనే వెల్లడికానుంది.