సినిమా వార్తలు

మార్చి 4 నుంచి ర‌వితేజా కొత్త చిత్రం షూటింగ్‌


7 months ago మార్చి 4 నుంచి ర‌వితేజా కొత్త చిత్రం షూటింగ్‌

చాలా కాలం తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో హిట్ ద‌క్కించుకున్న‌ రవితేజ, ఆ తరువాత నటించిన ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జువాల్కర్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.. మార్చి 4 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుందని స‌మాచారం. ఈ సినిమా ఆరంభంలో రవితేజ వృద్ధుడిగానూ, అనంతరం శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం సైంటిఫిక్ ప్రయోగాలతో యువకుడిగానూ మారుతాడని భోగ‌ట్టా.