సినిమా వార్తలు

పందిపిల్లతో రవిబాబు పాద‌యాత్ర‌


11 months ago పందిపిల్లతో రవిబాబు పాద‌యాత్ర‌

బ‌స్సు యాత్ర‌, రైలు యాత్ర‌, పాద యాత్ర‌.. ఇవ‌న్నీ జ‌నంలోకి వెళ్ల‌డానికి పార్టీల చేసే ఎత్తుగడలని విటుంటాం. జ‌న నేత‌లు ఎంచుకునే ప్ర‌త్యామ్నాయాఇవి. అయితే ఈ యాత్ర‌లు చిత్ర‌సీమ‌కూ వ్యాపించాయి. `విజ‌య‌యాత్ర‌` పేరుతో… స‌క్సెట్ టూర్లు నిర్వహిస్తుంటారు సినిమావాళ్లు. అయితే ర‌విబాబు కాస్త కొత్త‌గా ఆలోచించాడు. సినిమా విడుద‌ల‌కు ముందే… ఓ పాద యాత్ర మొద‌లెట్టాడు. అదీ పందితో. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `అదుగో`. బంటి అనే పంది పిల్ల చుట్టూ న‌డిచే క‌థ ఇది.

త్రీడీ యానిమేష‌న్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా ప్ర‌చారాన్ని వినూత్నంగా చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అందుకే పందితో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టాడు ర‌విబాబు. చంక‌లో పందిని ప‌ట్టుకుని, చిత్ర‌బృందంతో హైద‌రాబాద్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ రౌండ్లు వేయ‌బోతున్నాడు ర‌విబాబు. బాగుందికదా ఈ ప్రచారం.