సినిమా వార్తలు

వెంకీమామలో అల్లుడి సరసన రాశీఖన్నా


7 months ago వెంకీమామలో అల్లుడి సరసన రాశీఖన్నా

హీరో వెంకటేష్, నాగ చైతన్య కాంబో లో వెంకీమామ సినిమా తెరకెక్కబోతుందనే వార్త బయటకొచ్చిన దగ్గరి నుండి సినిమాకు సంబందించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది. మొన్నటి వరకు చైతు సరసన రకుల్ నటిస్తుందనే వార్త ప్రచారమైంది. ఆమెను తప్పించి నభా నటేష్ కు హీరోయిన్ అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె కూడా కాదు ఫైనల్ గా రాశి ఖన్నా ను ఓకే చేసినట్లు సమాచారం. ఇక వెంకీ సరసన కూడా ముందుగా శ్రీయను అనుకున్నారు. ఆ తర్వాత ఆమెను తప్పించి ఆర్ఎక్స్ బ్యూటీ పాయిల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేశారట. ఇలా వరుసగా హీరోయిన్లను మారుస్తు చిత్రయూనిట్ అభిమానులను టెన్షన్ కు గురిచేస్తోంది. మరి ఇక వీరినైనా ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.