సినిమా వార్తలు

త్వరలో సెట్స్ పైకి రానా 'విరాటపర్వం 1992'


9 months ago త్వరలో సెట్స్ పైకి రానా 'విరాటపర్వం 1992'

కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తూ నటుడిగా రానా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనకి ఉన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గకుండగా నిలబెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రానా మరో విభిన్నమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రం ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగులతో ఒక కొత్త కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. 'విరాటపర్వం 1992' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా రానాను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక కథానాయిక పాత్రకిగాను సాయిపల్లవిని ఎంపిక చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ముందుగా హీరో పాత్ర శర్వానంద్ దగ్గరికి వెళ్లిందనీ, ఈ జోనర్ తనకి సెట్ కాదని ఆయన చెప్పడంతో రానాను సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.