సినిమా వార్తలు

జనవరిలో సెట్స్ పైకి రానా 'హిరణ్య కశిప'


9 months ago జనవరిలో సెట్స్ పైకి రానా 'హిరణ్య కశిప'

దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రం తరువాత, 'హిరణ్యకశిప' టైటిల్ తో ఓ పౌరాణిక చిత్రం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతున్నదనీ, టైటిల్ రోల్ ను రానా చేయనున్నాడని తెలిపారు. ఇటీవల ఈ ప్రాజెక్టును గురించి సురేశ్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు జరిగింది. అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో గ్రాఫిక్స్ కి సంబంధించిన ప్లానింగ్ సిద్ధమైపోయిందని సమాచారం. అలాగే హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మాణాలు కూడా ముగింపు దశకి చేరుకున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నదనేది తాజా సమాచారం. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నట్లు సమాచారం. రానా కెరియర్లో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోతుందనే వార్త వినిపిస్తోంది.