సినిమా వార్తలు

ద‌ట్ట‌మైన అడ‌వుల్లో రానా సినిమా షూటింగ్‌


8 months ago ద‌ట్ట‌మైన అడ‌వుల్లో రానా సినిమా షూటింగ్‌

హీరో రానా తాజాగా 'హాథీ మేరే సాథీ' సినిమా రేమేక్‌లో న‌టిస్తున్నారు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, అడవి నేపథ్యంలో సాగుతుంది. అడవిలోని ఒక ఏనుగుకి .. కథానాయకుడికి గల అనుబంధం ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించారు. ఆ తరువాత ఈ సినిమా షూటింగుకి  కాస్త విరామం ఇచ్చారు. ఈ సమయంలోనే రానా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబునాయుడు పాత్రను చేశారు. తిరిగి 'హాథీ మేరే సాథీ' సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ కేరళలో మొదలైంది. ఇక్కడి అడవుల్లో రానా తదితరులపై కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా స‌మాచారం. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. తెలుగులో 'అరణ్య' పేరుతో .. తమిళంలో 'కాదన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.