సినిమా వార్తలు

చంద్రబాబును అచ్చుగుద్దిన రానా!


1 year ago చంద్రబాబును అచ్చుగుద్దిన రానా!

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ విదితమే. అలాంటి కీలకమైన పాత్ర కోసం రానాను ఎంపికచేశారు. ఆయన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవల చిత్రీకరించారు. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా విడుదల చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడి పోలికలకు దగ్గరగా రానా లుక్ ను తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక రకంగా రానా కెరియర్లో ఇది ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు, శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనున్నారని సమాచారం. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.