సినిమా వార్తలు

ఆర్ఆర్‌ఆర్‌లో విలన్‌గా రానా?


5 months ago ఆర్ఆర్‌ఆర్‌లో విలన్‌గా రానా?

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభంకానుందని సమాచారం. మరోవైపు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రెండు భాగాలుగా సినిమా తీస్తే... నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. విలన్ రోల్ ను రానా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా దీనిపై ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఈ చిత్రంలో విలన్ ఎవరైవుంటారో? లేదా ఇద్దరు విలన్లు ఉంటారా? అనే విషయం తేలాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.