సినిమా వార్తలు

రాజమౌళి చేతిలో రానా, ప్రభాస్ పెళ్లి సీక్రెట్స్


9 months ago రాజమౌళి చేతిలో రానా, ప్రభాస్ పెళ్లి సీక్రెట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో హీరోలు ప్రభాస్, రానా ముందు వరసలో నిలుస్తారు. వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా రూపొందుతున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో జక్కన్న ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బాహుబలి’ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి మంచి పేరు వచ్చింది.

ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ స్టార్‌డమ్‌ అంతర్జాతీయ స్థాయిని టచ్‌ చేసింది. ఐదేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం తర్వాత రాజమౌళి, ప్రభాస్, రానా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కోసం ఒకే వేదికపైకి చేరారు. త్వరలో ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుందని సమాచారం. ఈ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా ‘బాహుబలి’ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారని సమాచారం. ప్రభాస్, రానాల పెళ్లి గురించి కరణ్‌ ప్రశ్నించినప్పుడు రాజమౌళి.. ప్రభాస్‌ కంటే ముందే రానా పెళ్లి పీటలు ఎక్కుతారని చెప్పారట. అలాగే ‘నేను చాలా బద్ధకస్తుడ్ని. అదే నా పెద్ద బలహీనత’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్‌ వ్యాఖ్యానించారట. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన టాప్‌ 5 సినిమాల్లో ‘బాహుబలి’ ఉందన్న విషయం తెలిసిందే