సినిమా వార్తలు

పూరీతో రామ్ సినిమా


9 months ago పూరీతో రామ్ సినిమా

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిల కాబినేష‌న్లో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా పూరీనే వ్యవహరిస్తుండటం విశేషం. ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా మే 2019లో విడుదల కానుంది.  పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై లావణ్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకూ రామ్‌ని స్టైలిష్, డైనమిక్ రోల్స్‌లోనే చూశాం. కానీ ఈ చిత్రంలో రామ్‌ని కొత్త గెటప్‌లో చూపిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.