సినిమా వార్తలు

ఒంటరి పక్షులకు వర్మ సలహా!


8 months ago ఒంటరి పక్షులకు వర్మ సలహా!

సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లమైపోయామని, తమకు అండగా ఎవరూ లేరని బాధపడిపోతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవరూ లేరని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ వెనుక ఎవరో ఉన్నారని మీరు ప్రతీక్షణం ఫీల్ అవుతారు’ అని సరదాగా ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.