సినిమా వార్తలు

తనపై వచ్చిన కార్టూన్‌ పోస్ట్ చేసిన ఆర్జీవీ


11 months ago తనపై వచ్చిన కార్టూన్‌ పోస్ట్ చేసిన ఆర్జీవీ

సంచలనం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తిరుపతిలో పూజలు చేయించుకుని షాక్ ఇచ్చిన విషయం విదితమే. ‘నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా రేపు పొద్దున్న 6 గంటలకు తిరుపతిలో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకు తిరుపతి శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివరాలు చెప్పబోతున్నాను’ అంటూ పూజానంతరం ప్రసాదం స్వీకరించిన పిక్, లక్ష్మీ పార్వతితో కలిసి గుడి నుంచి బయటకు వస్తున్న పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే పరమ నాస్తికుడిగా ఇన్నాళ్లూ సమాజానికి తెలిసిన వర్మ ఇలా ఒక్కసారిగా ఆస్తికుడుగా మారిపోవడంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. తాను తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో తనపై వచ్చిన ఓ కార్టూన్‌ను తాజాగా వర్మ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘మీ డూప్ గుళ్లో కనబడ్డాడు’ అని క్యాప్షన్‌తో ఉన్న కార్టూన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కార్టూన్‌ని చూసిన నెటిజన్లు ‘ఇంకా మీరేమో అని పొరపడ్డాం గురువుగారు’ అంటూ ఫన్నీగా స్పందిచటం మరింత విశేషం.