సినిమా వార్తలు

'వినయ విధేయ రామ' సెన్సార్ పూర్తి


9 months ago 'వినయ విధేయ రామ' సెన్సార్ పూర్తి

రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. చరణ్ యాక్షన్, కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముందు చరణ్ చేసిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం 'అజర్ బైజాన్'లో ఒక యాక్షన్ ఎపిసోడ్ చేశారట. భారీ క్రేన్లుతో పాటు డ్రోన్లు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఈ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి చిత్రీకరించారని సమాచారం. అలాంటి ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.