సినిమా వార్తలు

50 కోట్ల షేర్ ను దక్కించుకున్న ‘వినయ విధేయ రామ’


8 months ago 50 కోట్ల షేర్ ను దక్కించుకున్న ‘వినయ విధేయ రామ’

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో  రూపొందిన 'వినయ విధేయ రామ' ఈ నెల 11వ తేదీన విడుదలైంది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. దర్శకుడిగా బోయపాటికి గల ఇమేజ్ కి తోడు చరణ్ కి గల క్రేజ్ కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 50 కోట్ల షేర్ ను దక్కించుకుంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా తొలివారంలో 12 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేకపోవడంతో, వసూళ్లు దిగజారే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా కుటుంబ కథా చిత్రమని అని చెబుతూ వచ్చారు. దాంతో ఓ మాదిరి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందనే టాక్ వినిపించింది.