సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ పై రామ్ చ‌ర‌ణ్ తాజా అప్‌డేట్స్‌


9 months ago ‘ఆర్ఆర్ఆర్’ పై రామ్ చ‌ర‌ణ్ తాజా అప్‌డేట్స్‌

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘విన‌య విధేయ రామ‌’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీడియాతో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘వినయ విధేయ‌ రామ’ చిత్రంతో పాటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను చరణ్ తెలిపాడు. ‘‘ఆర్ఆర్ఆర్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. మొదటి షెడ్యూల్ సన్నివేశాలు చాలా చ‌క్క‌గా వచ్చాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. నాకు, తారక్‌కు ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉండటం వల్ల సెట్‌లో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు.

సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్‌ మొదలవుతుంది. అసలు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు నేను, తారక్‌ షాకయ్యాం. మా ఇద్దరి ఫ్యాన్స్‌, రాజమౌళిగారి సినిమాలకున్న ఫ్యాన్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా చేస్తారని భావిన్తున్నాను.  రాజమౌళి ఈ సినిమాకు టైమ్ లిమిట్‌ పెట్టుకోలేం. అలా ఉంటే ఆయన పనిచేయలేరు. అందుకే టైమ్ గురించి పట్టించుకోకుండా.. ఈ సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేయాలని నేను, తారక్ అనుకున్నామ‌ని చ‌ర‌ణ్ తెలిపారు.