సినిమా వార్తలు

చిరంజీవికి కోపం తెప్పించిన చరణ్ నిర్ణయం?


7 months ago చిరంజీవికి కోపం తెప్పించిన చరణ్ నిర్ణయం?

హీరో రామ్ చరణ్ చేసే ప్రతి సినిమా విషయంలో చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన వినయ విధేయ రామ విషయంలో మాత్రం చిరంజీవి కల్పించుకోలేదని సమాచారం. చిరంజీవి.. సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉండటం వల్ల బోయపాటిపై నమ్మకంతో ఆ సినిమా విషయంలో  కల్పించుకోలేదని సినీ వర్గాల టాక్. కాగా వినయ విధేయ రామ ఫ్లాప్ తో డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో చరణ్ వారి నష్టాలను భరించేందుకు తన పారితోషికంలో కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్...  సినిమా ఫ్లాప్ కు బాధ్యత వహిస్తూ లేఖలు రాయడం,  పారితోషికం వెనక్కు ఇవ్వడం లాంటి చర్యలు చిరంజీవికి కోపం తెప్పించాయట.

ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటూ చిరు...చరణ్ ను ప్రశ్నించారట. వినయ విధేయ రామ చిత్రం మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. బయ్యర్లు నష్టపరిహారం డిమాండ్ చేయకుండానే చరణ్ పారితోషికం వెనక్కు ఇవ్వడంపై చిరంజీవి ఒకింత సీరియస్ అయినట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే ఫ్లాప్ వచ్చిన ప్రతి సారి కూడా నిర్మాతలు,బయ్యర్లు హీరోల వైపు చూస్తారని ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్లీ మళ్లీ ఆశిస్తారంటూ చిరంజీవి సున్నింతంగా చరణ్ ను హెచ్చరించారట. అలాగే ఈ విషయాలపై మొదట తనతో చర్చించక పోవడంపై కూడా  చిరంజీవి అసహనంగా ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం చరణ్ తీసుకోరని అంటున్నారు. అసలు చిరంజీవి చెప్పడం వల్లే అలా చేసి ఉంటాడనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.