సినిమా వార్తలు

మాస్ లుక్ తో ఆకట్టుకున్న వినయ విధేయ రామ !


11 months ago మాస్ లుక్ తో ఆకట్టుకున్న వినయ విధేయ రామ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ఖరారు అయింది. ఆ చిత్రం తాలూకు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. క్లాస్ లుక్ లో రామ్ చరణ్ ను చూపబోతున్నారని ఈ ఉదయం వార్తలు వచ్చినప్పటికీ ,ఫస్ట్ లుక్ లో మాత్రం రామ్ చరణ్ మాస్ లుక్ తో ఆయుధం పట్టుకు పరుగెడుతూ కనిపిస్తున్నాడు. ఎంతో కాలంగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈరోజు పండుగే. 
ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ కాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం టీజర్ నవంబర్ 10 న విడుదల కానుంది. రంగస్థలం వంటి సూపర్ హిట్ తరువాత విడుదలవుతున్న చిత్రం కనుక దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.