సినిమా వార్తలు

క్ష‌ణం తీరిక‌లేకుండా చ‌ర‌ణ్ క‌ష్టం


10 months ago క్ష‌ణం తీరిక‌లేకుండా చ‌ర‌ణ్ క‌ష్టం

హీరో రామ్ చరణ్ రంగస్థలం  సినిమా విజ‌య‌వంత‌మ‌య్యాక కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. 80 దశకం నాటి బ్యాక్ డ్రాప్ లో చేసిన రంగ‌స్థ‌లం నాన్ బాహుబలి క్యాటగిరీలో నిలవడంతో ఫ్యాన్స్ కూడా ఆ విజయానందాన్ని అందుకున్నారు. నిజానికి చరణ్ పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం విపరీతమైన ఒత్తిడిని బాలన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. వినయ విధేయ రామ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే ఆర్ ఆర్ ఆర్ కోసం తారక్ తో కలిసి రాజమౌళి మల్టీ స్టారర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చెర్రి బిజీగా మారిపోయారు.

ఆ ఎపిసోడ్ పూర్తి కాగానే తిరిగి వచ్చి వినయ విధేయ రామ ఐటెం సాంగ్ పూర్తి చేయాలి. దాని తర్వాత కొంత గ్యాప్ దక్కినా రాజమౌళి ఎక్కువ రోజులు ఖాళీగా ఉండనివ్వడు. ఇది నాణేనికి ఒక వైపు. ఇక మరో కోణంలో చూస్తే నిర్మాతగా రామ్ చరణ్ ఇంతకింతా అనిపించే క్లిష్టమైన బాద్యతలు మోస్తున్నాడు. తండ్రి చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా షూటింగ్ పీక్స్ లో ఉంది.

కొణిదెల బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ మంచి నీళ్ళలా ఖర్చవుతోంది. ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పాటల చిత్రీకరణ మొదలుపెట్టలేదు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ చరణ్ చూసుకోవాలి. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేయబోయే 152 కోసం బ్యాక్ గ్రౌండ్ లో స్క్రిప్ట్ వర్క్  తో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని స‌మాచారం అంటే మొత్తం నాలుగు సినిమా బాధ్యతలను చరణ్ మోస్తున్నారు.