సినిమా వార్తలు

జయలలిత జీవితచరిత్రలో రమ్యకృష్ణ కీరోల్


7 months ago జయలలిత జీవితచరిత్రలో రమ్యకృష్ణ కీరోల్

అందాల కథానాయికగా అలరించడంతోపాటు సమర్థవంతురాలైన రాజకీయ నాయకురాలిగాను జయలలిత ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు కనిపిస్తాయి. అలాంటి ఆమె జీవితచరిత్రను ఆవిష్కరించడానికి తమిళ దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను ధారావాహికగా తీయడానికి గౌతమ్ మీనన్ రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఆయనే దర్శకత్వం చేస్తాడా .. నిర్మాతగా మాత్రమే ఉంటాడా? అనేది ఇంకా తెలియాల్సివుంది. ఈ ధారావాహికకుసంబంధించిన సన్నాహాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. 30 ఎపిసోడ్స్ గా ఈ ధారావాహిక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రసారమవుతుందని తెలుస్తోంది. జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. టీవీలో ప్రసారమైన తరువాత ఇది వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తారట.