సినిమా వార్తలు

కృష్ణవంశీ కోసం నాగ్ తో రమ్య రాయభారం?


9 months ago కృష్ణవంశీ కోసం నాగ్ తో రమ్య రాయభారం?

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కృష్ణవంశీకి చాలాకాలంగా సక్సెస్ లు లేవు. కొంతకాలంగా ఆయనకి అవకాశాలు కూడా రావడంలేదు. మరాఠీ సినిమా 'నట సామ్రాట్'ను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు కూడా అంత వేగంగా ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సొంత బ్యానర్లో ఓ సినిమా చేయాలనే ఉత్సాహంతో కృష్ణవంశీ ఉన్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో నాగార్జునతో కృష్ణవంశీ తెరకెక్కించిన 'నిన్నే పెళ్లాడుతా' సినిమా, నాగ్ కెరియర్లోనే గొప్ప సినిమాగా నిలిచింది.

ఆ తరువాత 'చంద్రలేఖ' సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా వార్తలు వినిపించాయి. వీలైతే నాగ్, లేదంటే చైతూ, అఖిల్ తో గాని సినిమా చేయడానికి కృష్ణవంశీ ఆసక్తిని చూపిస్తున్నాడట. ఈ విషయంలో నాగ్ ను ఒప్పించేందుకు రమ్యకృష్ణ తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి నాగ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదో చూడాలిమరి!