సినిమా వార్తలు

అచ్చుగుద్దిన జయలలితగా రమ్యకృష్ణ


8 months ago అచ్చుగుద్దిన జయలలితగా రమ్యకృష్ణ

విజయవంతమైన సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, పవర్‌ఫుల్ ముఖ్యమంత్రిగా, ఐరన్ లేడీగా దివంగత జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు కొదవలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ గా మారారు. ఇప్పటికే నిత్యామీనన్.. జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతుండగా తాజాగా వెబ్ సిరీస్ ‌కూడా రూపొందుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా జయలలిత పాత్రలో ఉన్న రమ్యకృష్ణను లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో రమ్యకృష్ణ అచ్చు జయలలితను పోలివుంటడం విశేషం. అంతేకాదు జయలలిత జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నందున ఈ వెబ్ సిరీస్‌లో నటించేందకు రమ్యకృష్ణకు భారీ రెమ్యూరేషన్ ఇస్తున్నారని సమాచారం. మూడు సిరీస్‌గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత యంగ్ క్యారెక్టర్‌లో మాత్రం కొత్త హీరోయిన్ నటించనుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో రూపొందిస్తున్నారు.