సినిమా వార్తలు

బంగార్రాజు లో నాగ్ సరసన రమ్యకృష్ణ ఖరారు


10 months ago బంగార్రాజు లో నాగ్ సరసన రమ్యకృష్ణ ఖరారు

హీరో నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'సోగ్గాడే చిన్నినాయనా' ఒకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకి అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచే కథను సిద్ధం చేయమని అప్పట్లోనే కల్యాణ్ కృష్ణకి నాగార్జున చెప్పార‌ట‌. ఆ తరువాత కల్యాణ్ కృష్ణ కథ చెప్పడం .. నాగ్ మార్పులు చెప్పడం జరుగుతూ వస్తోందట‌. అలా ఇద్దరూ కలిసి కథను ఒక కొలిక్కి తెచ్చేశారట. ఇప్పుడు పెర్ఫెక్ట్ గా కథ రెడీ అయింద‌ని స‌మాచారం. అందరూ అనుకున్నట్టుగానే నాగార్జున సరసన కథానాయికగా రమ్యకృష్ణను ఖరారు చేశారు. మరో జోడీలో చైతూను మాత్రం తీసుకున్నారు. కథానాయిక ఎంపిక‌పై చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయ‌ని సమాచారం. చైతూకి జోడీ కుద‌ర‌గానే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.