సినిమా వార్తలు

ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు


1 year ago ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు

మిర్యాలగూడలో జరిగిన పరువుహత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంప‌తులు స్పందించారు. ప్రణయ్ హత్య తనను కలచి వేసిందని చ‌ర‌ణ్ చెప్పారు. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించారు. ఈ సమాజం ఎటు వెళ్తోందని అన్నాడు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.ఇదే ఉదంతంపై ఉపాసన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘విషాద గడియలు.. అసలు మనం, మన సమాజం ఎటు వెళ్తోంది’’ అని ట్యాగ్ చేశారు. హీరో రామ్ చరణ్ స్పందిస్తూ ఒక మనిషిని అత్యంత దారుణంగా చంపించడం పరువు హత్య అవుతుందా? అసలు ఈ సమాజం ఎటు వెళుతోందని ఆవేదన వ్యక్తం చేయగా.. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. ప్రణయ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ప్రణయ్ హత్య యావత్ తెలుగు ప్రజల హృదయాలను కలిచివేసింది. చాలా ఏళ్లుగా ప్రేమించుకుని ఒక్కటైన ప్రణయ్- అమృత వర్షిణి జంటకు అమృత తండ్రే కాలయముడిగా మారి ప్రణయ్‌ని అత్యంత దారుణంగా హత్య చేయడం షాక్‌కి గురి చేసింది. కాగా ప్రణయ్ హత్య కేసులో విచారణ మొదలు పెట్టిన పోలీసులు ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావును ఏ 1 నిందితుడిగా ప్రకటించారు. ఇప్పటికే ఈ పరువు హత్యను పలువురు రాజకీయ నేతలు, సామాజిక సంఘాలు ఖండించిన సంగతి తెలిసిందే.