సినిమా వార్తలు

‘ఎన్టీఆర్’లో రకుల్ రెమ్యునరేషన్?


9 months ago ‘ఎన్టీఆర్’లో రకుల్ రెమ్యునరేషన్?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ బయోపిక్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. విద్యాబాలన్, రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బయోపిక్‌లో మరో కీలక పాత్ర శ్రీదేవిది. ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీదేవి ఫస్ట్ లుక్ కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఎన్టీఆర్‌తో శ్రీదేవి 14 సినిమాల్లో నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. దీంతో ఈ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కూడా కీలకంకానుంది.  రకుల్, ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న బాలయ్యతో కలిసి ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు డ్యాన్స్ చేస్తున్న పిక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో రకుల్ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉంటుని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ రూ.కోటి రూపాయలు తీసుకుందని తెలుస్తోంది. అయితే రకుల్‌తో వేటగాడు మూవీలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాట మాత్రమే కాకుండా మరికొన్ని పాటలు కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. అంతే కాకుండా ఈ బయోపిక్ పార్ట్ 2 లో కూడా రకుల్ కనిపించనుందని భోగట్టా