సినిమా వార్తలు

రకుల్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్


7 months ago రకుల్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్

ప్రస్తుతం కథానాయిక రకుల్ ప్రీత్‌ చేతిలో పెద్దగా సినిమాలేమీ లేవని తెలుస్తోంది. ఈ మధ్యే రకుల్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో మెప్పించబోతున్నారు. ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేవని తెలుస్తోంది. కానీ కోలీవుడ్‌లో మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. సినిమా చూసి రివ్యూలివ్వడం దగ్గర నుంచి పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పడం వంటివన్నీ అందరితో పంచుకుంటారు.

తాజాగా రకుల్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయిందట. ఈ విషయాన్నిఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది. అది రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఏ లింక్స్ పట్ల, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు’’ అని రకుల్ ట్వీట్‌లో అభిమానులకు సూచించారు.