సినిమా వార్తలు

రకుల్ సంచలన నిర్ణయం... అవకాశాలు తగ్గాయనా?


9 months ago రకుల్ సంచలన నిర్ణయం... అవకాశాలు తగ్గాయనా?

చిన్న సినిమాలతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ప్రవేశించి స్వల్ప వ్యవధిలోనే స్టార్ హీరోయిన్‌గా అయ్యింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఎంత త్వరగా స్టార్‌ ఇమేజ్‌ సాధించిందో అంతే వేగంగా రకుల్ తన ఫాం కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2016లో ధృవ సినిమాతో చివరగా బిగ్‌ హిట్ అందుకున్న రకుల్‌ తరువాత టాలీవుడ్ లో ఒక్క ఘనవిజయం కూడా అందుకోలేదు. దీంతో ఈ అమ్మడి కెరీర్ కష్టాల్లో పడిందనే టాక్ వినిపించింది. అదే సమయంలో తమిళ, హిందీ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే ఇతర ఇండస్ట్రీలలో కూడా ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవటంతో రకుల్ తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అయితే కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉండటంతో రకుల్ ఇక్కడ  కూడా ఆఫర్లు తగ్గాయి. దీంతో టాలీవుడ్‌లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు సీనియర్ల సరసన నటించేందుకు కూడా సిద్ధమయ్యందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించేందుకు రకుల్ ఓకె చెప్పిందనేది తాజా సమాచారం. మరి ఈ సినిమాతో అయినా రకుల్‌ తిరిగి విజయాల బాటపడుతుదేమో చూడాలి.