సినిమా వార్తలు

చరణ్ సినిమాకు నో చెప్పిన రకుల్?


9 months ago చరణ్ సినిమాకు నో చెప్పిన రకుల్?

`వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌` సినిమాతో తెలుగు తెరపై ప్రవేశించిన ఢిల్లీ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా అంచలంచలుగా ఎదిగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌తో తప్ప దాదాపు టాలీవుడ్ హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించారు. ప్ర‌స్తుతం ఆమెకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి. ప్ర‌స్తుతం ఆమె `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

తాజాగా ర‌కుల్ ఓ `స్పెష‌ల్‌` ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ఓ సూప‌ర్ ఐటెమ్ సాంగ్ ఉంద‌ట‌. ఈ ఐటెమ్ సాంగ్‌లో ర‌కుల్ చేత న‌ర్తింప‌జేయాల‌ని బోయ‌పాటి, చెర్రీ భావించార‌ని సమాచారం. అయితే ర‌కుల్ ఆ సాంగ్ చేయ‌డానికి నిరాక‌రించింద‌ని తెలుస్తోంది. ఐటెమ్ సాంగ్‌ల్లో న‌ర్తించే ఉద్దేశం లేద‌ని చెప్పి త‌ప్పించుకుందట‌. దీంతో మరో బాలీవుడ్ భామ కోసం దర్శకుడు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు భోగట్టా.