సినిమా వార్తలు

ఎన్టీఆర్‌లో శ్రీదేవి ఇలా....


11 months ago ఎన్టీఆర్‌లో శ్రీదేవి ఇలా....

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టరు ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. తొలి భాగాన్ని ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో, రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ అనే టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. అతను కథగా మారితే ‘కథానాయకుడు’, అతను ఓ చరిత్ర అయితే మహానాయకుడు’ అవుతాడు అని పేర్కొంటూ ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’, ‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ పోస్టర్లును విడుదల చేశారు.

అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే విడుదలైంది. అలాగే చంద్రబాబు లుక్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లుక్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అది లెజెండరీ నటి శ్రీదేవి లుక్. ఈ పాత్రను రకుల్ ప్రీత్ పోషిస్తోంది. కట్టు, బొట్టు విషయంలో శ్రీదేవిని తలపిస్తోంది రకుల్. ఈ బయోపిక్‌కు సంబంధించిన తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.