సినిమా వార్తలు

అమెరికాకు వెళ్లిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!


9 months ago అమెరికాకు వెళ్లిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!
రోబో 2.ఓ సినిమా అమోఘ విజయంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మాంచి ఉత్సాహంతో ఉన్నారు. అలాగే రజనీ పెట్టా సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేసుకున్నారు. తరువాత ఆయన సైలెంట్ గా కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లారు. దీంతో రజినీకి ఏమైందోనని ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీ సన్నిహిత వర్గాలు స్పందించాయి. వైద్య పరీక్షల కోసమే రజనీ అమెరికా వెళ్లారని వివరణ తెలిపాయి. గతంలోనూ రజనీ తరచుగా అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారనీ, కానీ రోబో 2.ఓ షూటింగ్ కారణంగా అది వాయిదా పడటంతో ఇప్పుడు వెళుతున్నారని పేర్కొన్నాయి. అభిమానులు కంగారు పడాల్సిన విషయం ఏమీలేదని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రజనీ అమెరికాలోనే గడపనున్నారని తెలుస్తోంది. ఆయన భారత్ కు తిరిగివచ్చాక మురుగదాస్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభంకానుంది.