సినిమా వార్తలు

ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం


1 year ago ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం

భారీ వరదలతో కకావికలమైన కేరళలోని ఓ ఆసుపత్రిని పునర్మించేందుకు నటుడు రాజీవ్ దంపతులు ముందుకు వచ్చారు. అలిప్పి జిల్లా కున్నమ్మ ప్రాంతంలో శిథిలావస్థలోకి చేరిన ఆసుపత్రిని నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన వారు, ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మిస్తామని ఈ సందర్భంగా వారు మాట ఇచ్చారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన రాజీవ్ దంపతులు.. ఉడతా భక్తిగా మా వంతుగా చేతనైనంత సాయం చేస్తున్నాం. కున్నమ్మ ఆరోగ్య సంక్షేమ కేంద్రం నిర్మాణానికి ఎంత ఖర్చైనా భరిస్తాం అని తెలిపారు.