సినిమా వార్తలు

రాజ‌మౌళి త‌నయుని సినిమాలో విలన్ గా రాజశేఖర్?


10 months ago రాజ‌మౌళి త‌నయుని సినిమాలో విలన్ గా రాజశేఖర్?

రాజమౌళి తనయుడు కార్తికేయ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. గతంలో రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాకి దర్శకుడు. మ‌రోవైపు కీరవాణి తనయుడు 'కాలభైరవ' ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకంగా నిలుస్తుందంటున్నారు. అందువలన విలన్ పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నారని స‌మాచారం. ఏ కారణం చేతనైనా  మోహన్ లాల్ అందుబాటులో లేకపోతే, రాజశేఖర్ ను ఒప్పించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంద‌ని తెలుస్తోంది.