సినిమా వార్తలు

‘RRR’@12-12-12


10 months ago ‘RRR’@12-12-12

ప్లానింగ్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళికి పక్కాగావుంటారని పేరొందారు. ‘RRR’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన రాజమౌళి ఓ మ్యాజిక్ డేట్‌తో తన చిత్రాన్ని ప్రారంభించారు. నవంబర్ 11న ఉదయం 11 గంటలకు చిత్రాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికీ చిత్ర ఆరంభ తేదీని గుర్తుండిపోయేలా చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన మరో మ్యాజిక్ డేట్‌ను ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డేట్ 12-12-12. అంటే డిసెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాలను జక్కన్న వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆయన ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ గురించి వెల్లడించలేదు. 12-12-12న హీరోయిన్లకు సంబంధించిన సమాచారంతో పాటు మరికొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడిస్తారని తెలుస్తోంది.