సినిమా వార్తలు

త్వరలో రాజమౌళి, రజిని కాంబో?


6 months ago త్వరలో రాజమౌళి, రజిని కాంబో?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తారనే టాక్ ఒక వైపున వినిపిస్తుండగా, మరోవైపు రజనీ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. రాబోయే సంక్రాంతికి ఆయన 'పేట' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన మురుగదాస్ తో ప్లాన్ చేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్ తో, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడానికి మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఆ తరువాత సినిమాను మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్ తోనే చేస్తానని రజనీ ఆయనకి మాట ఇచ్చారట. మురుగదాస్, కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు పూర్తయిన తరువాత, రాజమౌళితో రజనీ సినిమా వుండే అవకాశం ఉందనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టు రజనీకాంత్ తోనే ఉంటుందనే వార్త కోలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవమెంతన్నదీ తెలుసుకోవాలంటే వేచిచూడాల్సిందే.