సినిమా వార్తలు

కొత్త సినిమాకు రాజ్ తరుణ్ ఓకే!


11 months ago కొత్త సినిమాకు రాజ్ తరుణ్ ఓకే!

తెలుగు తెరకు ఇటీవలి కాలంలో వరుసగా కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. టాలెంట్ వున్న వాళ్లు తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుని, పెద్ద హీరోలతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడిగా పరిచయం కావడానికి మల్లిడి వేణు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. నితిన్ తో ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక అల్లు శిరీష్ ను ఒప్పించడానికి కూడా తనవంతు కృషి చేశాడు గానీ, చివరి నిమిషంలో ఆ అవకాశం కూడా చేజారిపోయిందట. దాంతో రాజ్ తరుణ్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది. మల్లిడి వేణు వినిపించిన లైన్ నచ్చడంతో రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సాయిరామ్ బాబ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.