సినిమా వార్తలు

అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్


1 year ago అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్ యూత్ ని  అమితంగా అలరిస్తోంది. బుద్ధిమంతుడైన హీరో, ఆధునిక అమ్మాయిగా కనిపించే హీరోయిన్  వీరి కుటుంబాల మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో దర్శకుడు ఎలాన్ రూపొందించిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది.  అదే పేరుతో తెలుగులో తీసుకొస్తున్నారు. యువాన్ శంకర్ రాజా అందించిన సంగీతం కోలీవుడ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక్కడ కూడా అది అలాగే ఉంటుందంటున్నారు నిర్మాతలు. హరీష్ కళ్యాణ్ రైజా జంటగా నటించిన ఈ మూవీలో వీరిద్దరినీ హైలెట్ చేశారు.  హీరో పాత్రను అమాయకంగా తీర్చిదిద్దిన తీరు బాగుందంటున్నారు. హీరో హరీష్ కళ్యాణ్ సింపుల్ గా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యువాన్ చాలా రోజుల తర్వాత మ్యూజిక్ మేజిక్ చేసినట్టు అనిపిస్తోంది. ఆధునిక ప్రేమలను చూపించిన ఈ ప్యార్ ఇష్క్ కాదల్ కు విజయ్ మొరవనేని-యువన్ శంకర్ రాజా సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.