సినిమా వార్తలు

పూరి, రామ్‌ల కాంబో 'ఇస్మాట్ శంకర్'


8 months ago పూరి, రామ్‌ల కాంబో 'ఇస్మాట్ శంకర్'

రామ్ కథానాయకునిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన సొంత బ్యానర్లో ఒక సినిమా రూపొందనుంది. కథా కథనాల్లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా చేయడానికి రామ్ అంగీకరించినట్టు సమాచారం. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో పూరి ఉన్నారు. ఈ సినిమాకి ముందుగా 'పండుగాడు' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. తాజాగా 'ఇస్మాట్ శంకర్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. పాత్ర పరంగా ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాస మాట్లాడతాడని తెలుస్తోంది. ఇంతవరకూ తాను చేసిన వైవిధ్యభరితమైన పాత్రల జాబితాలో ఈ పాత్ర చేరుతుందనే నమ్మకంతో రామ్ ఉన్నాడని సమాచారం.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం, పూరి కనెక్ట్స్ ద్వారా ఒక తెలుగు అమ్మాయిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, గడ్డంతో రామ్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే రామ్ పాత్ర స్వభావం కూడా డిఫరెంట్ గా ఉంటుదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.