సినిమా వార్తలు

పురందేశ్వరి గెటప్ లో హిమన్సీ


11 months ago పురందేశ్వరి గెటప్ లో హిమన్సీ

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు పాత్రలపై స్పష్టత వచ్చింది. చంద్రబాబుగా రానా, నాగేశ్వరరావుగా సుమంత్, బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పురందేశ్వరి పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు పురందేశ్వరి పాత్రను విజయవాడకు చెందిన ప్రముఖ నృత్యకారిణి హిమన్సీ పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట. అంతేకాదు, పురందేశ్వరి గెటప్ లో ఉన్న హిమన్సీ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పురందేశ్వరి పక్కన నిల్చుని... హిమన్సీ నవ్వులు చిందిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే... చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడకతప్పదు.