సినిమా వార్తలు

అర్జున్ వేగానికి భాలీవుడ్ భామ ఫిదా


12 months ago అర్జున్ వేగానికి భాలీవుడ్ భామ ఫిదా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై చాలా రోజులైంది. కానీ ఇంతవరకు బన్నీ తన కొత్త సినిమా ప్రకటించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఉంటుందని, విక్రమ్ కుమార్ కూడా బన్నీతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  కాగా తాజాగా మోడల్, హీరోయిన్ అయిన పరుల్ గులాటి 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు జల్లులు కురిపిస్తొంది. అల్లు అర్జున్ లో మెరుపు వేగం చూసి తాను మంత్ర ముగ్ధురాలిని అయ్యాయని పరుల్ చెబుతోంది. ఇటీవల అల్లు అర్జున్, పరుల కలసి ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు.ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా పరుల్ బన్నీతో కలసి నటించింది. ఈ సందర్భంగా పరుల్ మాట్లాడుతూ అల్లు అర్జున్ లో మెరుపు వేగంతో పనిచేస్తారు. బన్నీ డాన్సులు ఎలా ఉంటాయో ఆయన వర్క్ కూడా అంతే స్పీడ్ గా ఉంటుంది అని తెలిపింది. వెంటనే పనిలో లీనమైపోతారు.

ఆయనతో కలసి సినిమాల్లో నటించలేదు కానీ డాన్సులు చూశాను అంటూ పరుల్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తింది. బన్నీతో పరుల్ తీసుకున్న సెల్ఫీ వైరల్ గా మారింది. ఈ సెల్ఫీలో బన్నీ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా బన్నీ తదుపరి చిత్రం ఎవరితో అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. బన్నీ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ కథ సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించాలని బన్నీ భావిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శత్వంలోని చిత్రం డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని భోగట్టా!