సినిమా వార్తలు

బన్నీ కోసం విలన్ గా మారిన పృధ్వీ


8 months ago బన్నీ కోసం విలన్ గా మారిన పృధ్వీ

30 ఇయర్స్ ఇండస్ట్రీలో కష్టపడిన తర్వాత పృధ్వీ పూర్తి స్దాయి కమిడియన్ గా బిజీ అయ్యారు.  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు  ఆయనికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది.  దాదాపు స్టార్ హీరో సినిమాలన్నిటిలోనూ కనిపిస్తూ నవ్వులు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో అవతారంలో కనిపించబోతున్నారు. త్వరలో విలన్ రోల్ లో తెరపై దుమ్ము రేపనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  రూపొందనున్న సినిమాలో పృధ్వీ విలన్ గా కనిపించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. కథలో భాగంగా యంగ్ విలన్ కు తండ్రిగా ఫృధ్వీ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అరవింద సమేతలో జగపతిబాబుని ఎంత ప్రత్యేకంగా చూపించారో అదే స్దాయిలో ఫృద్విని హైలెట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా1992లో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో మొదలైన పృధ్వి ప్రయాణం ‘ఖడ్గం’తో ఒక స్థాయికి, ఇప్పుడీ వరుస సినిమాలతో మరో స్థాయికి చేరుకుంది. పృధ్వి ఇప్పటివరకు దాదాపు వందకుపైగా చిత్రాలలో నటించారు.