సినిమా వార్తలు

అరవింద సమేతలో ప్రియాంక చోప్రా?


11 months ago అరవింద సమేతలో ప్రియాంక చోప్రా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా ‘అరవింద సమేత’లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ప్రత్యేక గీతంలో నర్తించనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిని రుజువు చేసేలా అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇటలీలో బాయ్ ఫ్రెండ్ నిక్ జొనాస్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇటలీలో ఈషా అంబానీ వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఈమె సన్నిహితులతో కలిసి మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అరవింద సమేత  హీరోయిన్ పూజా హెగ్డే అక్కడ ప్రత్యక్షం అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ క్రేజ్ ను దక్కించుకున్న పూజా హెగ్డేతో ప్రియాంక చోప్రా చాలా సన్నిహితంగా టైం స్పెండ్ చేసింది. ఎన్టీఆర్ తో నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ సభ్యులతో ఇటలీ వెళ్లిన ఈ అమ్మడు అక్కడ పాట చిత్రీకరించుకుని అక్కడే ఉన్న తన సన్నిహితులను కలుసుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా త్రివిక్రమ్ అరవింద సమేతలో ప్రత్యేక గీతం కోసం ప్రియాంకను అడిగారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం  ఆగాల్సిందే.