సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’లో ప్రియమణి!


9 months ago ‘ఆర్ఆర్ఆర్’లో ప్రియమణి!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తెరకెక్కుతోందనేది మనకు తెలుసు. కథానాయికల పేర్లు కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కీర్తి సురేష్, రష్మిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పాత్రకు ప్రియమణిని రాజమౌళి సంప్రదించారని సమాచారం.

ఇప్పటికే మేజిక్ డేట్ 12-12-12న కీలక ప్రకటన ఉంటుందని ఫిలింనగర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నటీనటుల గురించి ఆ రోజున రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు స‌మాచారం.