సినిమా వార్తలు

‘సిరివెన్నెల’తో వస్తున్న ప్రియమణి


7 months ago ‘సిరివెన్నెల’తో వస్తున్న ప్రియమణి

నిన్నటితరం కథానాయికల జాబితాలో ప్రియమణి ముందువరుసలో ఉంటుంది. కెరియర్ ఆరంభంలో కథానాయికగా కనిపించిన ఆమె, ఆ తరువాత 'క్షేత్రం', 'చారులత' సినిమాలలో ప్రధాన పాత్రధారిగా అదరగొట్టేసింది. కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు కొంతకాలంగా దూరమైన ప్రియమణి, తాజాగా మరో సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించింది. ఆ సినిమా పేరే 'సిరివెన్నెల'.  ఈ సినిమా ఇటీవలే టాకీపార్టును పూర్తి చేసుకుంది ఇంకా రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి వుంది. పులిజాల ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో సాగేదే అయినప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగినదిగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 'కాలకేయ' ప్రభాకర్ విలన్ గా నటించిన ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది